Tuesday, May 7, 2024

ఏజెంట్ గోపీ ఈజ్ బ్యాక్.. G2 ప్రీ విజన్ అనౌన్స్ మెంట్ కి సూపర్ రెస్పాన్స్!

బయోగ్రాఫికల్ యాక్షన్ ఫిల్మ్ ‘మేజర్’తో హిందీ ప్రేక్షకులకు పరిచయమైన అడివి శేష్.. హిట్ 2 రూపంలో మరో సూపర్ హిట్ సాధించిన అడివి శేష్ తన దృష్టిని పూర్తిగా తన మోస్ట్ వెయిటెడ్ మూవీ G2 (గూడచారి 2) , 2018లో రిలీజ్ అయిన యాక్షన్ థ్రిల్లర్ స్పై బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ పై మళ్లించాడు. ఈ సినిమాకి నటుడు స్వయంగా స్క్రిప్ట్ రాశారు.

ఈ ఎపిక్ యాక్షన్ చిత్రానికి వినయ్ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గతంలో మేజర్ సినిమాకు అతడు ఎడిటర్‌గా పనిచేశాడు. ఇక త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. వచ్చే ఏడాది చివర్లో లేదా 2024 ప్రారంభంలో సినిమా విడుదల చేసే అవకాశాలున్నాయి. ముందుగా ప్రకటించినట్లుగా, మూవీ టీమ్ G2 ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ముంబైలో గ్రాండ్‌గా ఆవిష్కరించింది. పోస్టర్‌లో అడివి శేష్ యాక్షన్ అవతార్ లో సూపర్ గా కనిపించాడు.

దాంతో పాటు, G2 ఇంటెన్స్ ప్రీ విజన్ అనౌన్స్ మెంట్ వీడియో ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్ మేకర్స్. ఈ వీడియో కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ కార్యక్రమానికి అభిషేక్ అగర్వాల్, అడివి శేష్, వినయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ ప్రకటించారు. హీరోయిన్, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపిన కార్తికేయ2, మేజర్ & కాశ్మీర్ ఫైల్స్ సినిమాలను ప్రొడ్యూస్ చేసిన నిర్మాన సంస్థలు (పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకుడు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement