Tuesday, May 7, 2024

గూఢచారి ఏదో అప్డేట్ ఇవ్వబోతున్నాడు!!

టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేషు గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. డిఫరెంట్ స్టోరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు అడవి శేషు. అయితే అడవి శేషు ఇప్పటి వరకు చేసిన సినిమాలలో గూడచారి ప్రత్యేకమైన చిత్రమని చెప్పాలి. అతి తక్కువ బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు అడవి శేషు.

అయితే ఈ సినిమా సీక్వెల్ పై కూడా అంచనాలు బాగానే వున్నాయి. అయితే గూడచారి సినిమా నేటితో సరిగ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మూడేళ్ల అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఒక ఆసక్తికరమైన అప్డేట్ ను రివీల్ చేశాడు అడవిశేషు. ఆగస్టు నెలలో పార్ట్ 2 చిత్రం పై ఓ స్పెషల్ అప్డేట్ ఇస్తున్నట్లు కన్ఫర్మ్ చేశాడు. ఈ ఆగస్టు నెల తనకు ఎంతో స్పెషల్ అని ఒక పెద్ద అప్డేట్ తన మిషన్ పై రానున్నట్లు హింట్ ఇచ్చాడు. కాగా ఆ అప్డేట్ ఏంటి అనేది వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement