Wednesday, May 1, 2024

ఎర్రకోటకు వచ్చే అతిథులు ఎవరో తెలుసా?

టోక్యో ఒలంపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారులను ఆగస్టు 15న ఎర్రకోటలో జరిగే జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించాలని ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు క్రీడాకారులను కలిసి వారితో ప్రధాని మోదీ ముచ్చటించనున్నారు. ఇప్పటివరకు ఒలంపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలు వచ్చాయి. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాభాయి చాను రజత పతకం సాధించగా.. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కాంస్య పతకం సాధించింది.

కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ నుంచి 18 క్రీడాంశాల్లో 127 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. గత ఐదేళ్ల కాలంలో భారత క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్నారు. జులై 23న ప్రారంభమైన ఒలంపిక్స్ క్రీడలు.. ఈ నెల 8తో ముగియనున్నాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ఒలింపిక్స్‌. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఒలింపిక్స్ జరుగుతాయి. ప్రణాళిక ప్రకారం 2020లోనే ప్రస్తుత ఒలింపిక్స్ జరగాలి. అయితే, కరోనావైరస్ కారణంగా వాయిదా వేశారు. దీంతో ఏడాది ఆలస్యంగా, జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు జపాన్‌లోని టోక్యోలో ఈ పోటీలు జరగుతున్నాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement