Saturday, April 27, 2024

నటుడు టార్జాన్ ఇంట విషాదం

టాలీవుడ్ క్యారెక్టర్ విలన్ లక్ష్మీనారాయణ గుప్త… అలియాస్ టార్జాన్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన భార్య ఉమారాణి అనారోగ్యంతో కన్నుమూశారు. ఉమారాణి వయసు 52 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గత కొంతకాలంగా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ వస్తున్నారు. అయితే ఆదివారం రాత్రి ఆమెకు గుండెపోటు వచ్చింది.

దాంతో ఆమె కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. కాగా ఆమె మరణం పట్ల సినీ పెద్దలు సంతాపం తెలుపుతున్నారు. లక్ష్మీనారాయణ కు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య ఉమారాణి. సంతానం లేకపోవడంతో అతను రెండో పెళ్లి చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement