Wednesday, May 22, 2024

భలే భలే బంజారా.. దుమ్మలేపిన అబ్బా కొడుకులు

ఈ మధ్య రిలీజ్​ ఆచార్య నుంచి రిలీజ్​ అయిన ‘‘భలే భలే బంజారా’’ పాట గ్లింప్స్ వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ప్రోమో విడుదలైన 16 గంటల్లోనే యూట్యూబ్‌లో 1.5మిలియన్లకు పైగా వీక్షించారు. కాగా.. చిరంజీవి, రామ్ చరణ్‌ నటించిన ఆచార్యలోని భలే భలే బంజారా అనే పాట ఆఖరికి విడుదలైంది. తండ్రీకొడుకులు కలిసి డ్యాన్స్ చేస్తూ వేదికపై నిప్పులు చెరుగుతున్న ఈ పాట అభిమానులకు పండగే. ఈ పాటను ప్రముఖ గాయకులు శంకర్ మహదేవన్, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. అయితే, దీని సాహిత్యాన్ని రామజోగయ్య శాస్త్రి రాసారు. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్.

కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఫిలింలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ఫీమేల్ లీడ్ రోల్ లో న‌టిస్తుండ‌గా.. సోనూసూద్, జిషు సేన్‌గుప్తా, సౌరవ్ లోకేష్ సహాయక పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement