Sunday, January 23, 2022

ఆచార్య సినిమా కొత్త పోస్టర్ వచ్చింది…కానీ రిలీజ్ డేట్ రాలేదు

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అలాగే రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. రాంచరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మే లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది.

అయితే చిరంజీవి బర్త్ డే స్పెషల్ గా… ఓ సరికొత్త పోస్టర్, రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నట్లు ముందు నుంచి వార్తలు వచ్చాయి. అయితే అనధికారికంగా సోషల్ మీడియాలో ఓ కొత్త పోస్టర్ వైరల్ అవుతోంది. ధర్మస్థలి దగ్గర మెగాస్టార్ నిలుచుని ఉన్న పోస్టర్ అది. అయితే దానిపై రిలీజ్ డేట్ కూడా ఎక్కడా ప్రకటించలేదు. దీంతో రిలీజ్ డేట్ పై మళ్లీ ఫ్రాన్స్ లో గందరగోళం నెలకొంది. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News