Sunday, May 12, 2024

Animal | ఎనిమిది రోజుల్లో 600 కోట్లు.. బాలీవుడ్ దుమ్ముదులుపుతున్న సందీప్ రెడ్డి మూవీ !

బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్ కపూర్ లేటెస్ట్ మూవీ ‘యానిమల్’. అర్జున్‌ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా… థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన మొద‌టిరోజు నుంచే బాక్సాఫీస్‌ను వ‌ద్ద‌ ప‌రుగులు పెట్టిస్తుంది. నాన్ హాలీడేస్ (వీక్ డేస్) లోనూ హౌల్​ఫుల్​ షోస్​తో కాసుల వర్షం కురిపిస్తోంది.

రీసెంట్‌గా ఈ సినిమా 500 కోట్ల క్ల‌బ్‌లో చేరినట్లు ప్ర‌క‌టించారు మేక‌ర్స్. ఇక‌ తాజాగా ఈ మూవీ 8 రోజుల‌కు రూ.600 కోట్ల మార్క్‌ను అందుకుని క‌లెక్షల్ల వేట‌ని కొనసాగిస్తొంది యానిమల్. కాగా, ఎనిమిదో రోజైన శుక్ర‌వారం ఒక్క హిందీలోనే రూ.21.56 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు మేక‌ర్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement