Sunday, May 5, 2024

1200 మంది ఫైట‌ర్స్ తో…

దర్శకుడు శంకర్‌ సినిమా అంటే హంగులకు కొదవే ఉండదు. ప్రతి విషయంలో భారీతనం ఉండాలని ఆయన భావిస్తాడు. శంకర్‌ ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు. కమల్‌హాసన్‌తో ‘భారతీయుడు 2’ సెట్స్‌పై ఉంది. ఇటీవలే తాజా షెఢ్యూల్‌కు పేకప్‌ చెప్పారు. మరోవైపు రామ్‌చరణ్‌తో మరో భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దిల్‌ రాజు నిర్మాత. సినిమా పేరు ‘గేమ్‌ చేంజర్‌’. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమామీద అంచనాలు పెంచాయి. రాజకీయ నేపథ్యంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గాఈ సినిమా ఉంటుందని సమాచారం. పాన్‌ ఇండియా సినిమాగా చిత్రీకరణ జరుపుకుంటోంది. షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమాకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో కొత్త అప్‌డేట్‌ వైరల్‌ అవుతంది. గేమ్‌ చేంజర్‌ పతాక సన్ని వేశాల చిత్రీకరణ ఇదేవారంలో మొద లవతుంది. భారీ ఎత్తున తీసేందుకు దర్శకులు ప్లాన్‌ చేశా రు. సుమార్‌ 1200 మంది ఫైటర్స్‌తో చిత్రీకరిస్తారని తెలిసింది. అన్బరివ్‌ (కేజీ ఎఫ్‌ ఫేమ్‌) నేతృత్యంలో ఈ ఫైట్‌ చిత్రీకరి స్తారని సమాచారం. ‘గేమ్‌ చేంజర్‌’ లో కియారా అద్వానీ నాయిక. థమన్‌ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement