Thursday, May 2, 2024

హిమజాకి లెటర్ రాసిన పవర్ స్టార్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటి హిమజకి లెటర్ రాశారు. దాంతో హిమజ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తన అభిమాన నటుడు పవన్ కల్యాణ్ తనకు శుభాకాంక్షలు తెలుపుతూ లెటర్ రాయడంతో ఉబ్బితబ్బిబవుతోంది.  పవన్ కల్యాణ్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ చిత్రంలో పవన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ పాత్రకు హిమజ ఎంపికైంది. తన అభిమాన నటుడితో కనిపించే ఛాన్స్ రావడంతో హిమజ ఉబ్బితబ్బిబ్బవుతోంది.  పవన్‌తో దిగిన సెల్ఫీలను ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. పవన్ తనకు రాసిన లేఖను హిమజ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. హిమజ గారికి, మీకు అన్ని శుభాలు జరగాలని, వృత్తిపరంగా మీరు ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను అని పేర్కొంటూ పవన్‌ ఓ లేఖను హిమజకు పంపించారు. ఈ లేఖను హిమజ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. నా ఆనందాన్ని మాటల్లోనూ, ఎమోజీల్లోనూ చెప్పలేకపోతున్నానని వెల్లడించింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement