Sunday, May 19, 2024

హార్టెటాక్ తో నిర్మాత మృతి..

నిర్మాత సందీప్ కొరిటా గుండెపోటుతో మరణించారు. దాంతో సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఈయన మరణ వార్త తెలుసుకొని హీరో నారా రోహిత్, దర్శకుడు సుధీర్ వర్మ సంతాపం తెలియజేసారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వచ్చిన ‘స్వామిరారా’, పాటల రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా వచ్చిన ‘రౌడీ ఫెలో’ సినిమాలకు సందీప్ కొరిటాల సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో స్వామిరారా సూపర్ హిట్ అవ్వగా.. రౌడీ ఫెలో సినిమాకు ప్రశంసలు వచ్చాయి. సందీప్ మరణించిన  విషయం తెలుసుకొని ఈ రెండు సినిమాలకు పని చేసిన నటీనటులు, టెక్నికల్ విభాగం సంతాపం వ్యక్తం చేశారు.  ఎంతో అద్భుతమైన వ్యక్తి.. సున్నితమైన హృదయం కలిగిన సందీప్ ఇంత అర్ధాంతరంగా మన మధ్య నుంచి వెళ్ళిపోతావు అని అనుకోలేదు అంటూ దర్శకుడు సుధీర్ వర్మ ఎమోషనల్ అయ్యారు. మరోవైపు హీరో నారా రోహిత్ కూడా ఈ నిర్మాత గురించి ట్వీట్ చేశారు. ‘నా రౌడీ ఫెలో సినిమా సహ నిర్మాత, నా శ్రేయోభిలాషి సందీప్ కొరిటాల ఇకలేరనే వార్త విని చాలా బాధపడ్డాను. ఈ రోజు ఇంత బాధాకరంగా ప్రారంభమవుతుందని అనుకోలేదు. ఓం శాంతి’ అని నారా రోహిత్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. పలువురు సినీ ప్రముఖులు కూడా సందీప్ కొరిటాల మృతికి సంతాపం తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement