Sunday, May 12, 2024

సెప్టెంబర్ 9న ‘లైగర్’

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న చిత్రం లైగర్. ఈ మూవీని దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్నాడు. కాగా  భారీ పాన్ ఇండియా చిత్రం లైగర్ విడుదల తేదీ బయటకు వచ్చింది. సెప్టెంబర్ 9వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం తాజాగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్, ఛార్మీ, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ భామ అనన్యా పాండే కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ రోజు (గురువారం) నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ముంబైలో ప్రారంభం కాబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement