Friday, May 24, 2024

‘సమంత’@11..విషెస్ తెలిపిన ‘శాకుంతలం’ టీం

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినీ అరంగ్రేటం చేసి 11ఏళ్లు పూర్తయింది. కాగా దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తోన్న మరో భారీ చిత్రం శాకుంతలం. మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల..దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. కాగా ఈ మూవీలో శకుంతలగా  సమంత ప్రధాన పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల 20 నుంచి మొదలు కాబోతుందట.   సినీ అరంగేట్రం చేసి 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సమంతకు చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పింది. ఆమెతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలిపింది. సమంత నటించిన తొలి తెలుగు చిత్రం ఏ మాయ చేశావే 2010 ఫిబ్రవరి 26న విడుదలైంది. నేటితో ఆ సినిమా విడుదలై 11 ఏళ్లు పూర్తయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement