Monday, May 6, 2024

శ్రీవిష్ణు కొత్త చిత్రం ‘అర్జున ఫల్గుణ’

శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కనున్న చిత్రం అర్జున ఫల్గుణ థీమ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఆ సంగతులు.ఇప్ప‌టికే గాలి సంప‌త్ చిత్రం  చేస్తున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు . ఇపుడు మ‌రో ప్రాజెక్టును కూడా లైన్ లో పెట్టాడు శ్రీవిష్ణు. ఈ సారి తేజ మ‌ర్ని డైరెక్ష‌న్ లో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ థీమ్ పోస్ట‌ర్ ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది.ఈ చిత్రం పేరు ‘అర్జున ఫ‌ల్గుణ’ ‌. శ్రీవిష్ణు, అమృతాఅయ్య‌ర్ ను కొంద‌రు వ్య‌క్తులు వెంబ‌డిస్తున్న‌ట్టు పోస్ట‌ర్ ప్ర‌తిబింబం ద్వారా తెలుస్తుంది. తాజాగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్ సినిమాపై అంచ‌నాలను పెంచేస్తుంది. ఈ ప్రాజెక్టు చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌లో ఉంది. హసిత్ గోలి డైరెక్ట్ చేస్తున్న రాజ‌రాజ చోర చిత్రం కూడా చేస్తున్నాడు శ్రీవిష్ణు.

Advertisement

తాజా వార్తలు

Advertisement