Tuesday, May 7, 2024

‘శ్యామ్ సింఘరాయ్’ ఫస్ట్ లుక్..’నాని’ని పట్టుకున్నదెవరు..!

దర్శకుడు రాహుల్ సంకీర్త్యన్ తెరకెక్కిస్తోన్న చిత్రం శ్యామ్ సింఘరాయ్. ఈ మూవీలో హీరోగా నాని నటిస్తున్నాడు. హీరోయిన్స్ గా సాయిపల్లవి..కృతిశెట్టి నటిస్తున్నారు. ఈ రోజు నాని పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. పీరియాడిక్ టచ్ లో ఉన్న లుక్ తో నాని ఈ ఫస్ట్ లుక్ లో కనిపిస్తున్నాడు. కాగా  సంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో ఉన్న ఓ యువ‌తి ఫేస్ ‌క‌నిపించ‌కుండా నానిని హ‌గ్ చేసుకోవ‌డం, బ్యాక్ గ్రౌండ్‌లో రాయ‌ల్ ప్రింటింగ్ ప్రెస్, ఓ ప‌క్క రిక్షా, మ‌రోవైపు టైప్ రైట‌ర్ ను గ‌మ‌నించ‌వ‌చ్చు. అయితే నానిని హ‌గ్ చేసుకుంది సాయిప‌ల్ల‌వినా, కృతిశెట్టియా అనేది సస్పెన్స్ గా ఉంది. ఈ మూవీలో మ‌‌డోన్నాసెబాస్టియ‌న్, రాహుల్ ర‌వీంద్ర‌న్‌, ముర‌ళీ శ‌ర్మ ఇత‌ర కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.  మిక్కీ జే మేయ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. కోల్‌క‌తా బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాకు సంబంధించి టైటిల్‌, కాన్సెప్ట్ పోస్ట‌ర్ ను ఇప్ప‌టికే విడుద‌ల చేయ‌గా మంచి స్పంద‌న వ‌చ్చింది. నిహారిక‌ ఎంట‌ర్ టైన్ మెంట్ బ్యాన‌ర్ పై వెంక‌ట్ ఎస్ బోయిన‌ప‌ల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement