Wednesday, May 15, 2024

సల్మాన్‌ మూవీకీ భారీ రేటు

కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఇమేజ్‌ ఏమాత్రం తగ్గటం లేదు…. వరుసగా ఆయన సినిమాలు ప్లాప్‌ అవుతున్న..కుర్ర హీరోలకు ధీటుగా సల్మాన్‌ మార్కెట్ ‌రికార్డులను క్రియేట్‌ చేస్తున్నాడు. తాజాగా సల్మాన్‌ అప్‌ కవిుంగ్‌ మూవీ రాధే రికార్డు ధరకు అమ్ముడుపోయింది. జీ స్టూడియోస్‌ సంస్థ రాధే మూవీ అన్ని రకాల హక్కులను రూ.235 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సల్మాన్‌ గత మూడు చిత్రాలు బాక్సాఫీస్‌ దగ్గర మంచి విజయం సాధించకపోయిన రాధే మూవీకి కోసం అంత వెచ్చిండం చూస్తుంటే భాయిజాన్‌ క్రేజ్‌ అంతకంతకూ పెరుగుతోందని ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. రాధే మూవీ మే 20 రంజాన్‌ కానుకగా ప్రేక్షకులు ముందుకు రానుంది. సల్మాన్‌‌కు జోడీగా దిశపఠానీ నటిస్తోంది. జాకీ ష్రాఫ్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement