Tuesday, April 30, 2024

‘లవ్ స్టోరి’ నుంచి సాంగ్ రిలీజ్ చేసిన ‘సమంత’

లవ్ స్టోరి చిత్రం నుంచి సారంగ దరియా సాంగ్ ని స్టార్ హీరోయిన్ సమంత రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్నారు. హీరోగా నాగచైతన్య..హీరోయిన్ గా సాయిపల్లవి నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ. అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె.నారాయణదాస్ నారంగ్..పి.రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.   చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఏప్రిల్‌ 16న సినిమాను విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. కాగా ఆదివారం ఈ సినిమాలో ‘సారంగ దరియా…’ లిరికల్‌ సాంగ్‌ను సమంత అక్కినేని విడుదల చేశారు. “ఈ సీజన్‌లో డాన్స్‌ సాంగ్‌ను విడుదల చేస్తున్నాను. సాయిపల్లవి నువ్వు మెస్మరైజ్‌ చేశావు” అంటూ సాయిపల్లవిని పొగుడుతూ సమంత అక్కినేని ట్వీట్‌ చేశారు. ఓ అమ్మాయి గుణగణాలను పొగుడుతూ సాగే ఈ పాటను సుద్దాల అశోక్‌ తేజ రాశారు. మంగ్లీ పాట పాడారు. శేఖర్‌ మాస్టర్‌ ఈ సాంగ్‌కు నృత్య రీతులను కంపోజ్‌ చేశారు. ‘ఫిదా’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న లవ్‌స్టోరి కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement