Saturday, May 18, 2024

‘మర్యాద కృష్ణయ్య’గా ‘సునీల్’..హ్యాపీ బర్త్ డే

నేడు ఫిబ్రవరి 28న హరీో సునీల్ పుట్టినరోజు. మర్యాదరామన్నగా మెప్పించిన సునీల్ ప్రస్తుతం ఆయన నటిస్తోన్న చిత్రం మర్యాద కృష్ణయ్య. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి దర్శకుడు వి.ఎన్.ఆదిత్య. సునీల్ హీరోగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం మర్యాద రామన్న. ఈ చిత్రంలో సునీల్   ఓ భయస్తుడు, దురదృష్టవంతుడైన ఓ యువకుడు ఫ్యాక్షన్‌ ప్రాంతానికి వెళితే, అక్కడ తను ఊహించని పాత పగలతో ప్రత్యర్థులు చంపడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఆ యువకుడు తనకు ఎదురైన సమస్యను ఎలా అధిగమించాడనేదే ‘మర్యాదరామన్న’. అప్పుడు ‘మర్యాద రామన్న’గా మెప్పించిన సునీల్‌, ఇప్పుడు ‘మర్యాద కృష్ణయ్య’గా ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు.  సునీల్‌ బర్త్‌డే సందర్భంగా ఆయన టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న కొత్త చిత్రం ‘మర్యాద కృష్ణయ్య’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది.  ఏటీవీ ఒరిజినల్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకాలపై కిషోర్‌ గరికపాటి, టీజీ విశ్వప్రసాద్‌, అర్చనా అగర్వాల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిబొట్ట సహ నిర్మాత వ్యవహరిస్తోన్న ఈ చిత్రానికి సాయికార్తీక్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘మర్యాద కృష్ణయ్య’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ చూస్తుంటే హీరో సునీల్‌ ఇందులోనూ ‘మర్యాద రామన్న’ తరహాలోనే భయస్థుడి పాత్రలో కనిపిస్తాడేమో అనిపించేలా ఉంది. కమెడియన్‌ నుంచి హీరో, మళ్లీ హీరో నుంచి కమెడియన్‌గా మారిన సునీల్..ఈసారి కమెడియన్‌గా, హీరోగా సినిమాలు పక్కా ప్లానింగ్‌ను సిద్ధం చేసుకున్నట్లు స్పష్టమవుతుంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement