Sunday, May 5, 2024

‘రానా’ సినీ ప్రస్థానం@11ఇయర్స్

యంగ్ హీరో రానా దగ్గుబాటి  తాజాగా 11 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు. దేశవ్యాప్తంగా పలు భాషల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానా నటించిన లీడర్ సినిమా 19 ఫిబ్రవరి 2010న విడుదలైంది. ఆ సినిమా ఈ రోజు (శనివారం)తో 11 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రానా భార్య మిహిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విషెస్ చెప్పింది. లీడర్ సినిమా పోస్టర్‌ను పోస్ట్ చేసి.. హ్యాపీ 11 ఇయర్స్.. మై డార్లింగ్ రానా అని పేర్కొంది. ఇక, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ కూడా రానాకు ట్విటర్ ద్వారా విషెస్ చెప్పింది. రానా జర్నీకి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement