Thursday, May 9, 2024

మార్చి 20నుండి ‘శాకుంతలం’

మార్చి 20నుండి శాకుంతలం మూవీ రెగ్యులర్ షూట్ జరగనుందట. సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ రూపొందించనున్న చిత్రమే శాకుంతలం. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మెయిన్ లీడ్ చేస్తుందని ఈ చిత్ర మేకర్స్ అధికారికంగా ప్రకటించారు కూడా. కాగా  శాకుంత‌లం చిత్ర షూటింగ్ ఎప్పుడు మొద‌ల‌వుతుందా అని మేక‌ర్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స‌మ‌యంలో క్రేజీ అప్‌డేట్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. మార్చి  20 నుండి ఈ మూవీ రెగ్యుల‌ర్‌గా జ‌ర‌గ‌నుంద‌ని, చిత్రాన్ని తెలుగు, త‌మిళంతో పాటు హిందీ భాష‌ల‌లోను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకు స‌మంత రెమ్యున‌రేష‌న్ భారీగానే తీసుకుంటుంద‌నే టాక్ వినిపిస్తుంది. విభిన్నమైన పౌరాణిక ప్రణయ గాథగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తన 10 ఏళ్ల కెరీర్ లో తొలిసారి సమంత పౌరాణిక పాత్రలో నటించబోతుందటం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement