Friday, May 3, 2024

మంచ్ చాక్లెట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా

టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం పలు కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా వ్యవహరిస్తోంది. తాజాగా మరో బ్రాండ్ కు సపోర్ట్ చేయడానికి ఓకే చెప్పింది సమంత. ఆ బ్రాండ్ ఏమిటో తెలుసా… మంచ్‌ చాక్లెట్‌ ..ఎస్ మంచ్ చాకోలెట్ కు బ్రాండ్‌ అంబాసిడర్ గా ఎంపిక అయ్యింది. రెండు రోజుల పాటు మంచ్‌ చాక్లెట్‌ యాడ్‌ షూటింగ్ లో సమంత పాల్గొనబోతున్నట్లుగా సమాచారం. ఈ యాడ్‌ ను హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారట.ఇక సినిమాల విషయానికి వస్తే ఇప్పటికే తమిళంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. విఘ్నేష్‌ శివన్ దర్శకత్వంలో నయనతార హీరోయిన్‌ గా విజయ్‌ సేతుపతి హీరోగా నటిస్తున్న సినిమాలో  మరో హీరోయిన్‌గా సమంత నటిస్తుంది .

Advertisement

తాజా వార్తలు

Advertisement