Monday, April 29, 2024

అవినీతిని స‌హించ‌బోను – అభివృద్ధి కోసం అంద‌రిని క‌లుపుకు పోతా..మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మీ..

హైదరాబాద్: అవినీతి జరిగితే సహించబోనని, అందుకోసం ఎంత దూరమైనా వెళతానని, ఎవరినీ వదిలిపెట్టేదిలేదని అన్నారు గ్రేట‌ర్ హైద‌రాబాద్ కొత్త మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మీ స్ప‌ష్టం చేశారు. మేయ‌ర్ గా ప్ర‌మాణం చేసిన ఆనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ, మాట్లాడుతూపేదలకు అన్యాయం జరగకూడదని అన్నారు. పార్టీతో సంబంధం లేకుండా కార్పొరేటర్‌గా ఎన్నికైన మహిళలందరిని తన కుటుంబసభ్యుల్లా కలుపుకుంటు ముందుకు వెళతానని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సభను గందరగోళం లేకుండా ఐదేళ్లు ప్రశాంతంగా నడిపిస్తానని, సభ్యులకు సహకరిస్తానని విజయలక్ష్మి పేర్కొన్నారు. అనంతరం జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి ఆమె అమరవీరుల స్థూపంవద్దకు వెళ్లి నివాళులర్పించారు. అక్కడి నుంచి ప్రగతి భవన్‌కు ఆమె, డిప్యూటీ మేయ‌ర్ శ్రీల‌త‌లు సీఎం కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్నారు. త‌మ‌కు అవ‌కాశం ఇచ్చిన కెసిఆర్ కి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు. విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు నివాసముంటున్న హైదరాబాద్ నగరం అసలు సిసలైన విశ్వనగరంగా, మినీ ఇండియాగా భాసిల్లుతున్నదని, ఈ నగర వైభవాన్ని మరింత పెంచే విధంగా కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాటు పడాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement