Monday, April 29, 2024

ప్రియాంక ‘అన్ ఫినీష్ డ్’ లో అన్ని వివరాలు

హాలీవుడ్ లోకి అడుగు పెట్టి.. యూనివర్సల్ స్టార్ గా మారింది ప్రియాంకచోప్రా. హాలీవుడ్ లోను ఆమెకు అదే క్రేజ్ రావడం విశేషం. తాజాగా ప్రియాంకా తన అనుభవాలను పంచుకునేందుకు తన ఆత్మకథను పుస్తకంగా తెచ్చారు. తన ఆత్మకథను అన్‌ఫినీష్‌డ్ అనే పేరుతో పుస్తకాన్ని ఫిబ్రవరి 9న విడుదల చేసింది. ఆ పుస్తకంలోని అంశాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. యూపీలోని ఓ కుగ్రామం నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన ప్రియాంకా జర్నీ అందులో ఉంది.. తన ఆత్మకథలో పలు వివాదాస్పద అంశాలను ప్రస్తావించారు. యూపీలోని ఓ చిన్న గ్రామం నుంచి వినోద రంగంలో ప్రవేశించినప్పటి నుంచి మిస్ వరల్డ్ టైటిల్ దక్కించుకొనే వరకు, అలాగే బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తన ప్రయాణం లాంటి మధురమైన మెమొరీస్‌తోపాటు  వర్ణ వివక్ష, బాలీవుడ్‌లో నెపొటిజం తదితర అంశాలను పుస్తకంలో తెలిపింది. ముఖ్యంగా  ఓ బాలీవుడ్ డైరెక్టర్ అరాచకాన్ని బయటపెట్టింది. ఐటెమ్ సాంగ్‌ను చిత్రీకరించేటప్పుడు నా బట్టలను విప్పమన్నాడు. అయితే అందుకు నిరాకరిస్తూ.. శరీరం కనిపించకుండా చర్మ రంగుతో ఉండే దుస్తులను వేసుకొంటానని చెప్పగా డైరెక్టర్ కోపంతో ఊగిపోయాడు.తనను స్టైలిష్ట్‌తో మాట్లాడమని చెప్పడంతో అతడికి ఫోన్ చేశాను. నా స్టైలిష్‌తో మాట్లాడగా నాకు షాకింగ్ కలిగించే విషయాలు చెప్పారు. మీరు ఏదైనా వేసుకోండి. కానీ మీరు ధరించిన ప్యాంటీలు కూడా తెరపైన కనిపించాలి. వాటిని చూడటానికే ప్రేక్షకులు సినిమాకు వస్తారని డైరెక్టర్ చెప్పినట్టు స్టైలిష్ట్ చెప్పడంతో నాకు విపరీతమైన కోపం వచ్చింది అనే విషయాన్ని పుస్తకంలో ప్రస్తావించారు. ఇంకా చాలా విషయాలనే ఆ పుస్తకంలో తెలిపింది ప్రియాంకచోప్రా.

Advertisement

తాజా వార్తలు

Advertisement