Wednesday, May 8, 2024

పింక్ డ్రెస్ లో మెరిసిన ‘సితార’

సూపర్ స్టార్ మహేశ్ బాబు ముద్దుల తనయ సితార పింక్ కలర్ డ్రెస్ లో మెరిసింది. సితార సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిన్నారి చ‌దువుల‌పై దృష్టి సారిస్తూనే మ‌రోవైపు నెటిజ‌న్స్‌ను అల‌రించే ప్ర‌య‌త్నిస్తుంది. త‌న తండ్రి సినిమాల‌కు సంబంధించిన పాట‌లు పాడ‌డం, డ్యాన్స్‌లు చేయ‌డం వంటివి చేస్తూ అంద‌రి దృష్టి ఆక‌ర్షిస్తుంటుంది. తాజాగా సితార త‌న‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పింక్ క‌ల‌ర్ డ్రెస్‌లో దిగిన క్యూట్ పిక్స్ షేర్ చేసింది. ఈ పిక్స్ సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement