Friday, May 3, 2024

న్యూఢిల్లీ : గ్రేటా ధన్ బర్గ్ టూల్ కిట్ కేసులో బెంగళూరు యువతి అరెస్టు

పర్యవరణ ఉద్యమకారిణి  గ్రేటా థన్ బర్గ్ షేర్ చేసిన టూల్ కిట్ కేసులో ఢిల్లీ పోలీసులు బెంగళూరుకు చెందిన యువతిని ఈ రోజు  అరెస్టు చేశారు. బెంగళూరు సోలదేవనహల్లికి చెందిన దిశరవి అనే పర్యావరణ ఉద్యమ కార్యకర్తలు ఈ కేసులో పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.   ఫ్రైడే ఫర్ ఫ్యూచర్ అనే స్వచ్ఛంద వ్యవస్థాపకుల్లో ఆమె ఒకరు.   గ్రెటా పోస్ట్ చేసిన టూల్ కిట్ ను ఎడిట్ చేసి తదుపరి పోస్ట్ చేశానని ఆమె ఒప్పుకున్నట్టు స్పెషల్ సెల్ పోలీసులు చెబుతున్నారు.   సాగు చట్టాల రద్దు డిమాండ్ తో చేస్తున్న రైతుల ఉద్యమానికి ఇటీవల గ్రెటా థన్బర్గ్ కూడా మద్దతు తెలిపింది. ఈ మేరకు ట్వీట్ చేస్తూ,  ఓ టూల్ కిట్ ను షేర్ చేసింది. ఖలిస్థానీ గ్రూప్ అయిన పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్   టూల్ కిట్  తయారు చేసిందని, ఆ టూల్ కిట్ వల్లే జనవరి 26న హింస జరిగిందని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement