Sunday, April 28, 2024

‘లవ్ స్టోరి’ నుంచి వాలంటైన్స్ డేకి సాంగ్

దర్శకుడు  శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న చిత్రం లవ్ స్టోరి. ఈ చిత్రంలో అక్కినేని నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా నటిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఫిదా త‌ర్వాత శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుద‌ల చేస్తున్నారు. వాలంటైన్స్ డే సంద‌ర్భంగా ఆదివారం ల‌వ్‌స్టోరి సినిమా నుంచి నీ చిత్రం చూసి... అనే పాట‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement