Tuesday, May 21, 2024

న్యూస్ పేపర్ లాంటి డ్రెస్ లో ‘శ్రీముఖి’

 యాంకర్, నటి శ్రీముఖి  న్యూస్ పేపర్ స్టిల్  తర్జాలంలో అగ్గి రాజేస్తోంది. సంథింగ్ స్పెషల్ గా ఏదీ చేయనిదే ఎవరైనా ఎందుకు పట్టించుకుంటారు.. అందుకే శ్రీముఖి ఇలా లేటెస్ట్ ఫోటోషూట్ తో విరుచుకుపడింది. చూడటానికి న్యూస్ పేపర్ చుట్టుకున్నట్టే ఉన్నా.. అదో డిజైనర్ డ్రెస్. ఇక ఈ డ్రెస్ లో థై సొగసుల ఎలివేషన్ తో పాటు గ్లామర్ ఎలివేషన్ విషయంలో ఎక్కడా తగ్గలేదు శ్రీముఖి. సాటి యాంకర్లు అనసూయ.. రేష్మిలకే మతి చెడే ట్రీటిచ్చిందని చెప్పాలి. ఫిబ్రవరి 14న వేలెంటైన్ డే సందర్భంగా గ్రేట్ న్యూస్ చెబుతానని శ్రీముఖి ఊరించింది. ఇంతకీ ప్రేమికుల రోజున ఏ కబురు చెబుతుందో? తన లవ్ గురించా..?  లేక పెళ్లి గురించా.. ఇంకేదైనానా  అంటూ నానా హైరానా పడిపోతున్నారు ఫ్యాన్స్. ఈ రెండ్రోజులు ఆగడం కష్టమేనేమో. అన్నట్టు శ్రీముఖి ఇంతకుముందు కథానాయికగా పలు చిత్రాల్లో నటించింది. ఇటీవల సాటి యాంకర్ అనసూయ పెద్ద తెరపై స్టార్ డమ్ తో దూసుకుపోతుంటే తాను మాత్రం ఎందుకనో స్లో అయిపోయింది. మరి ఈసారి ఏదైనా స్పీడ్ ఉన్న మ్యాటర్ చెబుతుందేమో కూడా వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement