Saturday, July 27, 2024

Andhra Pradesh – ఎపిలో రేప‌టి నుంచి ఆరో్గ్య శ్రీ బంద్

హాస్ప‌ట‌ల్స్ కు రూ.1500 కోట్ల‌ బ‌కాయిలు
ఎన్నిసార్లు అడిగినా ఇదిగో అంటూ కాల‌యాప‌న
రూ.530 కోట్లు విడుద‌ల చేశామంటూ ప్ర‌భుత్వం డ్రామా
ఒక్క పైసా కూడా ఖాతాలో ప‌డ‌లేద‌న్న హాస్ప‌ట‌ల్స్
విధిలేని ప‌రిస్థితుల‌లోనే ఆరోగ్య శ్రీ సేవ‌ల‌కు బ్రేక్ ..

ఏపీ ప్రజలకు అలర్ట్. ఆరోగ్య శ్రీ పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ అసోసియేషన్‌ (ఆశా) కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన చికిత్స బిల్లులను ప్రభుత్వం చెల్లించట్లేదని వెల్లడించింది. గత ఆగస్టు నుంచి ఈ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయని పేర్కొంది. వీటి విలువ సుమారు రూ.1,500 కోట్ల వరకు ఉందని చెప్పింది.

- Advertisement -

రూ.530 కోట్ల విలువైన బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు ఈ నెల 2వ తేదీన సీఈఓ చెప్పారని కానీ ఇప్పటివరకు చెల్లించలేదని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ వెల్లడించింది. ఉద్యోగుల ఆరోగ్య శ్రీ పథకం కింద సుమారు రూ.50 కోట్ల బిల్లుల చెల్లింపులే జరిగాయని తెలిపింది. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం నుంచి ఆరోగ్య శ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద సేవలు నిలిపివేయాలని నిర్ణయించామని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement