Monday, July 22, 2024

Telangana – రెండు నెలల స్టైఫండ్ పెండింగ్ .. రేపటి నుంచి స‌మ్మె బాట‌లో జూనియ‌ర్ డాక్ట‌ర్స్…

తెలంగాణ‌లో రేపటి నుంచి జూడాలు సమ్మెకు దిగనున్నారు. రెండు నెలలుగా స్టైఫండ్ పెండింగ్..ఉందని…వాటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ రేపటి నుంచి జూడాలు సమ్మెకు దిగనున్నారు. పెండింగ్ లో ఉన్న మార్చి, ఏప్రిల్ నెలల స్టైఫండ్ చెల్లించాల‌ని కోరినా వైద్య శాఖ నుంచి స‌రైన స్పంద‌న లేదంటున్నారు వైద్యులు .. ఇక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇటీవలే ప్రతినెలా 15లోపు స్టైఫండ్ విడుదల చేస్తామని చెప్పారు. అయినా ఇంకా 2 నెలల స్టైఫండ్ రాలేదని, ఆర్ధిక శాఖ నుండి రెండు, మూడు రోజుల్లో స్టైఫండ్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రేపటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement