Friday, May 3, 2024

‘నితిన్’ 30వ చిత్రం అప్ డేట్

వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు యంగ్ హీరో నితిన్. ఆయన  న‌టించిన రంగ్ దే చిత్రం మార్చి 26న విడుద‌ల కానుండ‌గా, చెక్ ఫిబ్ర‌వ‌రి 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాల‌పై అభిమానులలో భారీ అంచ‌నాలు ఉండ‌గా, వీటికి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు మొద‌లు పెట్టారు. మ‌రోవైపు నితిన్ .. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. నితిన్ 30వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్  దుబాయ్‌లో జ‌రుగుతున్న‌ట్టు టాక్. బాలీవుడ్ లో సూప‌ర్ హిట్‌గా నిలిచిన ‘అంధాదున్’ సినిమాకి  రీమేక్  తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ స‌ర‌స‌న న‌భా న‌టేష్ హీరోయిన్ గా న‌టిస్తుంది. తాజాగా చిత్ర రిలీజ్ డేట్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. జూన్ 11న చిత్రం విడుద‌ల కానుంద‌ని తెలియ‌జేస్తూ విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో  నితిన్ ‌ ష‌ర్టుపై స్వెట‌ర్ వేసుకొని పియానో ప్లే చేస్తూ క‌నిపిస్తున్నారు. ఈ మూవీలో త‌మ‌న్నా భాటియా ఓ కీల‌క పాత్ర చేస్తున్నారు.  శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఈ సినిమాను ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. మ‌హ‌తి స్వర‌సాగ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి హ‌రి కె. వేదాంత్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement