Wednesday, May 8, 2024

‘దృశ్యం2’ కి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్

దృశ్యం2 చిత్రానికి గ్రీన్ సిగ్రల్ ఇచ్చాడట సీనియర్ హీరో వెంకటేష్.  శ్రీప్రియ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ బాక్సాపీస్ వ‌ద్ద మంచి టాక్ తెచ్చుకుంది. మ‌ల‌యాళ రీమేక్ గా వ‌చ్చిన ఈ చిత్రానికి సీక్వెల్ కూడా వ‌స్తోంది. మోహ‌న్‌లాల్‌-మీనా  న‌టించిన దృశ్యం 2 (మ‌ల‌యాళం) ఫిబ్ర‌వ‌రి 19న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియ‌ర్ కానుంది. ఈ చిత్రాన్ని ఇటీవ‌లే చూసిన వెంకీ సీక్వెల్ చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్ టాక్‌. అంతేకాదు జీతూజోసెఫ్ డైరెక్ష‌న్ లో రానున్న తెలుగు వెర్ష‌న్‌లో నటించేందుకు అగ్రిమెంట్ కూడా రాసుకున్నాడ‌ట‌. సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. వెంకీ దృశ్యం 2కు డేట్స్ కూడా ఇచ్చిన‌ట్టు టాక్ న‌డుస్తోంది. ప్ర‌స్తుతం ఎఫ్3 షూటింగ్‌తో బిజీగా ఉన్న వెంకీ, దీంతోపాటు దృశ్యం 2 షూట్‌లో కూడా పాల్గొన‌నున్న‌ట్టు టాక్‌. శ్రీకాంత్ అడ్డాల‌-వెంక‌టేశ్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న ఈ చిత్రం మే 14న విడుద‌ల కాబోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement