Saturday, April 27, 2024

జూన్ 3న ‘గుడ్ లక్ సఖీ’

హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న గుడ్ లక్ సఖి చిత్రం జూన్ 3న రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ని ప్రకటించింది. జూన్ 3న  ఈ చిత్రం  తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళంలో విడుద‌ల కానుంది.  నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ “గుడ్ లక్ సఖి” సినిమాకి శ్రావ్య వర్మ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పాడిరి గుడ్ ల‌క్ స‌ఖి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. మంచి ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రోవైపు కీర్తి సురేష్ న‌టించిన రంగ్ దే చిత్రం మార్చి 26న విడుద‌ల కానుండ‌గా, స‌ర్కారు వారి పాట చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో నిల‌వ‌నుంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement