Wednesday, May 8, 2024

జూన్ 18న రొమాంటిక్..

హీరో..స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ నటిస్తోన్న మూవీని జూన్ 18న రిలీజ్ చేయనున్నారట. మూడేళ్ల తర్వాత ఆకాష్ రొమాంటిక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాకు కథ ..మాటలు..స్ర్కీన్ ప్లే పూరి జగన్నాథ్ అందిస్తున్నారు. ఆయన శిష్యుడు అనిల్ పడూరీ రొమాంటిక్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 2019 లోనే సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా క‌రోనా వ‌ల‌న కొద్ది రోజులు వాయిదా ప‌డింది. లాక్‌డౌన్ త‌ర్వాత మిగ‌తా చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసి జూన్ 18న థియేట‌ర్స్‌లోకి ఈ సినిమాను తీసుకురాబోతున్నారు. కొద్ది సేపటి క్రితం రొమాంటిక్ పోస్ట‌ర్ విడుద‌ల చేస్తూ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించారు.  ఇందులో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ  సినిమాతో హిట్ కొట్టాల‌ని ఆకాశ్ ఆశ‌గా ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement