Friday, May 17, 2024

‘ఆనంద్ దేవరకొండ’ మూడో చిత్రం..

హీరో ఆనంద్ దేవరకొండ మూడో చిత్రం పుష్పక విమానం ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.  ఆనంద్ దేవ‌ర‌కొండ మూవీ ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేశారు.హీరో..ఆనంద్ అన్న  విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న త‌మ్ముడి మూడో సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా విడుద‌ల చేస్తూ చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ అందించారు. పుష్ప‌క విమానం అనే టైటిల్‌ని ఆనంద్ దేవ‌ర‌కొండ మూడో సినిమాకి ఫిక్స్ చేసిన‌ట్టు పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు.దామోద‌ర అనే నూత‌న ద‌ర్శ‌కుడు ఈ సినిమాతో ప‌రిచ‌యం కానుండ‌గా, ఇందులో శాన్వి మేఘ‌న‌, గీత సైనీ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. సునీల్, సీనియ‌ర్ న‌రేష్ కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. డార్క్ కామెడీ మూవీగా ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌నుంద‌ని అంటున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement