Thursday, May 2, 2024

‘కమల్’ కి శృతి బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్

విశ్వ నటుడు కమల్ హాసన్ కి గిఫ్ట్ ఇచ్చారు శృతిహాసన్ బాయ్ ఫ్రెండ్ ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్  శాంతను హజారిక. వీరిద్దరూ లవ్ లో ఉన్నారని వార్తలు వస్తున్నా వీటిపై స్పందించలేదు.   తమ ప్రేమ గురించి వీరిద్దరూ ఇప్పటివరకు అధికారికంగా స్పందించకపోయినప్పటికీ.. ఒకరినొకరు కౌగిలించుకుని ప్రేమలోకంలో విహరిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల శాంతను చెన్నై వచ్చి శృతి తండ్రి కమల్ హాసన్‌ను కూడా కలిశారు. కమల్‌కు అదిరిపోయే బహుమతి అందించాడు. ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో టార్చ్‌లైట్ పట్టుకుని తమిళ రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి అరవీర భయంకరుడిగా కమల్ వస్తున్నాడనే థీమ్‌తో స్వయంగా ఓ చిత్రాన్ని గీసి దానిని కమల్‌కు అందించాడు. ఆ చిత్రం కమల్‌కు తెగ నచ్చేసింది. దానిని కమల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తన ఉద్దేశాన్ని గుర్తించినందుకు శాంతనుకు కమల్ ధన్యవాదాలు చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement