Sunday, May 19, 2024

‘చెక్’ షూట్ లో పడిపోయిన ‘ప్రియా ప్రకాశ్ వారియర్’

చెక్ షూటింగ్ లో జరిగిన ఫన్నీ సీన్ సోషల్ మీడియాలో  వైరలవుతోంది.  యంగ్ హీరో నితిన్  నటించిన చిత్రం చెక్. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది మలయాళ బ్యూటీ  ప్రియా ప్రకాశ్ వారియర్. ఈ చిత్రాన్ని చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కింది. కాగా  షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ను ఆమె అభిమానులతో షేర్ చేసుకుంది.షూటింగ్ లో భాగంగా, నితిన్ నడుస్తూ రాగా, వెనుక నుంచి పరిగెత్తుకుని వచ్చే ప్రియా ప్రకాశ్, ఎగిరి, వీపుపైకి ఎక్కాల్సి వుంది. ఈ సన్నివేశాన్ని షూట్ చేస్తున్న సమయంలో పట్టుతప్పిన ప్రియ, వెల్లకిలా నేలపై పడిపోయింది. పక్కనే ఉన్న సిబ్బంది వచ్చి ఆమె పైకి లేచేందుకు సాయం చేయగా, తనకేమీ కాలేదన్నట్టుగా ‘థంబ్’ చూపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement