Thursday, May 9, 2024

గ్లోబ్ అవార్డుల్లో ‘నోమాడ్ ల్యాండ్..బోర్టా’లకు టాప్ అవార్డులు

ఈ సంవత్సరం గ్లోబ్ అవార్డులలో నోమాడ్ ల్యాండ్,బోర్టా చిత్రాలకు టాప్ అవార్డులు వచ్చాయి. ఆ సంగతులు.బెస్ట్ పిక్చ‌ర్‌, బైస్ట్ డైర‌క్ట‌ర్ అవార్డుల‌ను నోమాడ్‌ల్యాండ్ ఎగురేసుకుపోయింది. చోలే జావోకు ఉత్త‌మ ద‌ర్శ‌కుడు అవార్డు ద‌క్కింది. ఆదివారం రాత్రి కాలిఫోర్నియాలో ఘ‌నంగా గోల్డెన్ గ్లోబ్ వేడుక‌ల‌ను నిర్వ‌హించారు. నోమాడ్‌ల్యాండ్‌లో హీరోయిన్ ఫ్రాన్సెస్ మెక్‌డార్మాండ్ ప్ర‌ధాన పాత్ర పోషించారు. ఇల్లు లేని ఓ మ‌హిళ‌.. ప‌శ్చిమ అమెరికాలో ప‌ర్య‌టిస్తుంది. ఆ క‌థ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. మ‌హిళా డైర‌క్ట‌ర్ చాలే జావో ఈ సినిమాకు డైర‌క్ష‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.  గోల్డెన్ గ్లోబ్ చ‌రిత్ర‌లో డైర‌క్ష‌న్ అవార్డును ఓ మ‌హిళ గెలుచుకోవ‌డం ఇది రెండ‌వ సారి.  1983లో బార్బ్రా స్ట్రీశాండ్ ఈ అవార్డును ద‌క్కించుకున్నారు.  2006లో రిలీజై స‌క్సెస్ సాధించిన బోర్టాకు సీక్వెల్‌గా వ‌చ్చిన బోర్టాకు బెస్ట్ మ్యూజిక‌ల్-కామిడీ అవార్డు ద‌క్కింది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement