Saturday, April 27, 2024

హీరో కానున్న వ్యక్తి ఒంటిపై ఆరు కిలోల బంగారం..

తాజాగా హీరోగా నటించాలనుకున్న ఓ వ్యక్తి ఏకంగా ఆరుకిలోల బంగారం ఒంటిమీద ధరించి సెట్ మీదకు వచ్చాడు. ఆయన గెటప్  తమిళనాడుకు చెందిన ప్రఖ్యాత ఏవీఎం స్టూడియో ఓ కొత్త సినిమాను తీయబోతున్నది. ఈ చిత్రం ద్వారా ఓ కొత్త హీరో తమిళతెరకు పరిచయం కాబోతున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ సినిమాలో నటించబోయే హీరో గోల్డ్ మాన్ హరి నాడార్ ఏకంగా ఆరుకిలోల బంగారం ధరించి సెట్ మీదకు వచ్చాడు. ఇప్పుడు ఈ విషయం సోషల్  మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. తమిళనాడులో నాడార్ అనేది ఓ బలమైన సామాజికవర్గం.  ఇటీవల ఆయన యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోలు పెడుతున్నారు. ఈ వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. దీంతో ఏకంగా సినిమానే తీయాలకున్నారు.రాజు తలుకుంటే దెబ్బలకు కొదవా చెప్పండి.. అనుకున్నదే తడువుగా ‘2K / అలగనాదు కాదల్’ పేరుతో చిత్ర నిర్మాణానికి పూనుకున్నారు. ఏవీఎం స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభ కార్యక్రమం జరిగింది. ప్రముఖ నిర్మాత ఆర్ బి చౌదరి కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సినిమాలో వివాదాస్పద నటి వనిత విజయ కుమార్ హీరోయిన్.. ఇదిలా ఉంటే ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement