Sunday, May 5, 2024

‘కియారా’ చేతిలో పలు క్రేజీ బ్రాండ్లు

యాడ్స్ తోనే కోట్ల రూపాయలు సంపాదిస్తోంది బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వాని. బాలీవుడ్ హీరోయిన్  కియరా అద్వాని తన ట్యాలెంట్ తో పలు కార్పొరెట్ బ్రాండ్లను తన ఖాతాలో వేసుకుంది. ఇంతకుముందు సోనాక్షి.. సోనమ్ వంటి స్టార్లు ప్రచారం చేసే మైంత్ర కు ఈ భామనే ఇప్పుడు బ్రాండ్ ప్రమోటర్. మరోవైపు నైకా వంటి ప్రఖ్యాత బ్రాండ్లకు కియరా ప్రమోషన్ చేస్తోంది. ఒప్పో.. హౌసింగ్ డాట్ కాం.. పారాచూట్.. మెబాజ్.. ఇలా ప్రఖ్యాత బ్రాండ్లన్నీ అమ్మడి ఖాతాలోనే పడ్డాయి. ఒక్కో అసైన్ మెంట్ కి ఒక్కో కాంట్రాక్టుకు కియరా కోట్లలో ఆర్జిస్తోందని సమాచారం. ఇప్పటికిప్పుడు కియరా ఖాతాలో పలు క్రేజీ బ్రాండ్లు ఉన్నాయి. వీటన్నిటితోనే భారీగా ఆర్జిస్తోంది. మరోవైపు ఒక్కో సినిమాకి కోట్లలో పారితోషికం అందుకుంటూ నిర్మాతల గుండెల్లో గుబులు పెంచేస్తోందిట. షేర్ షా- జగ్ జగ్ జియో- భూల్ భులయా 2 చిత్రాల్లో కియరా ప్రస్తుతం నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement