Tuesday, May 21, 2024

రాజ్ తరుణ్ ‘పవర్ ప్లే’ మార్చి5న

యంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తోన్న పవర్ ప్లే చిత్రం మార్చి 5న రిలీజ్ కానుంది. దర్శకుడు విజయ్ కుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం పవర్ ప్లే. ఈ చిత్రంలో హీరో రాజ్ తరుణ్. శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్  ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతోన్నఈ చిత్రాన్ని మ‌హిద‌ర్‌, దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్, ‌మోష‌న్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌కి మంచి   రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా మార్చి 5న గ్రాండ్‌గా  విడుద‌ల చేయ‌నున్నారు. ఈ రోజు ఫిబ్రవరి14న  వాలైంటైన్స్ డే సంద‌ర్భంగా స్పెషల్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.  ఈ సంద‌ర్భంగా రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ .. నేను విజ‌య్ ‌గారు క‌లిసి స‌రికొత్త జోన‌ర్‌లో చేస్తోన్న డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్ ఇది.  క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి హిట్ అవుతుంద‌ని న‌మ్మ‌కం ఉంది’ అని  అన్నారు.  ‘ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. సినిమా ఔట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది.  క‌చ్చితంగా సినిమా అంద‌రిని థ్రిల్ చేస్తుంది’ అని చిత్ర ద‌ర్శ‌కుడు విజ‌య్ కుమార్ కొండా చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement