Saturday, May 4, 2024

‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’..లిరికల్

ఇచ్చట వాహనాలు నిలుపరాదు నుంచి పద్మవ్యూహం సింగిల్ రిలీజ్ అయింది. ఈ చిత్రంలో హీరోగా సుశాంత్ నటిస్తున్నారు. కాగా ఈ విజువల్ సాంగ్ ఆద్యంతం థ్రిల్ కి గురి చేస్తోంది. సుశాంత్ మీడియా యువకుడిగా కనిపించారు. అతడిపై దాడికి దిగుతూ అఘాయిత్యాలకు పాల్పడే దుష్ఠశక్తుల కథ ఏంటీ..ఈ పద్మవ్యూహం నుంచి బయటపడతాడా అనేది ఆసక్తిగా ఉంది.  నేరాలు ఏమీ చేయని వారిని తీరం చేర్చే పూచీ నాదనీ.. అన్న లైన్ తోనే జర్నలిస్టులపై దాష్ఠీకాల్ని చూపిస్తూ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ట్రై చేస్తున్నారని అర్థమవుతోంది. కాలభైరవ గానం ఎమోషనల్ గా సాగగా.. అందుకు తగ్గట్టే ప్రవీణ్ లక్కరాజు సంగీతం ఉద్విగ్నతన పెంచింది. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. వెన్నెల కిషోర్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. వెంకట్- ప్రియదర్శి- అభినవ్ గోమటం ఐశ్వర్య- రవివర్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఎస్.దర్శన్ దర్శకత్వం వహిస్తుండగా.. రవిశంకర్ శాస్రి- హరీశ్ కోయలగుండ్ల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement