Thursday, May 16, 2024

‘ఆకాష్ పూరీ’ కొత్త చిత్రం ‘చోర్ బజార్’

ఆకాష్ పూరీ హీరోగాతన తదుపరి చిత్ర పూజా కార్యక్రమాలను జరుపుకున్నాడు. ‘జార్జ్ రెడ్డి’ చిత్రంతో విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి ఇన్ స్ఫైరింగ్ స్టోరీని తెరకెక్కించిన దర్శకుడు జీవన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఆకాష్ పూరీ, జీవన్ రెడ్డి కాంబినేషన్ చిత్రానికి ‘చోర్ బజార్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అంటే దొంగిలించిన వస్తువులన్నీ ‘చోర్ బజార్’కు చేరుతుంటాయి. అయితే ఈ కథను అంతా ఊహించినట్లు కాకుండా విభిన్నంగా తెరకెక్కిస్తున్నాడట దర్శకుడు జీవన్‌ రెడ్డి. ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో హీరో ఆకాశ్‌పై ఆయన సోదరి పవిత్ర పూరి క్లాప్ ఇవ్వగా, తల్లి లావణ్య కెమెరా స్విచ్చాన్ చేశారు. ఐ.వి ఎస్.ఎన్ రాజు ఫస్ట్ షాట్‌కు దర్శకత్వం వహించారు. బాలు మున్నంగి స్క్రిప్ట్‌ను అందించారు. వీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు తన తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ ‘చోర్ బజార్’ చిత్రంలో సుబ్బరాజు, పోసాని, ‘లేడీస్ టైలర్’ ఫేమ్ అర్చన ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభం అవుతుందని దర్శకనిర్మాతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement