Monday, May 6, 2024

అందరికి అందుబాటులో టాటా బింజ్‌.. ఒకే వేదికపై 17 ఓటీటీలు

టాటా ప్లే బింజ్‌ సేవలు ఒక నుంచి స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ యాప్‌ ఇప్పటి వరకు టాటా ప్లే డీటీహెచ్‌ చందదారులకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఒక్కో సినిమా ఒక్కో ఓటీటీలో విడుదల ఆవుతుండటంతో వినియోగదారులు చాలా ఓటీటీలకు చందా కట్టాల్సి వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా తీసుకువచ్చిందే టాటా ప్లే బింజ్‌. దీంతో ఒకే సబ్‌స్క్రిప్షన్‌తో వివిధ ఓటీటీ వేదికల్లో ఉండే కంటెంట్‌ను వీక్షించవచ్చు. ప్రస్తుతం టాటా ప్లే బింజ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న వారికి 28 వేల సినిమాలు, వెబ్‌ షోలు, క్రీడల ప్రత్యక్ష ప్రసారాలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 17 స్ట్రీమింగ్‌ యాప్‌లు, గేమింగ్‌ ఒకే గొడుగు కిందకు వచ్చాయి. ఏ సినిమా ఎందులో ఉందో వెతికే పనిలేకుండా యాప్‌లో యూనివర్సల్‌ సెర్చ్‌ బార్‌ను ప్రత్యేకంగా ఇచ్చారు.

ప్రీమియం మోడల్‌

టాటా ప్లే బింజ్‌ యాప్‌ను ఎవరైనా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆయా ఓటీటీ వేదికల్లో ఉండే ఉచిత కంటెంట్‌ను ఎలాంటి రుసుము లేకుండానే వీక్షించవచ్చు. ప్రీమియం కంటెంట్‌ కోసం మాత్రం నిర్దేశిత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. నెలవారి సభ్యత్వం 59 ప్రారంభమవుతుంది. అన్ని ఓటీటీలు కావాలంటే నెలకు 299 చెల్లించాల్సి ఉంటుంది. టాటా ప్లే బింజ్‌ ప్లస్‌ అమేజాన్‌ ఫైర్‌ స్టిక్‌ ద్వారా టీవీల్లోనూ ఈ ఓటీటీలను వీక్షించవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement