Sunday, May 19, 2024

Samsung | స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లో శామ్‌సంగ్‌ టాప్‌

ఈ ఆర్ధిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో భారత్‌లో 4.4 కోట్ల స్మార్ట్‌ ఫోన్ల సరఫరా జరిగినట్లు ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌ (ఐడీసీ) నివేదిక వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన ఎలాంటి వృద్ధి నమోదు కాలేదు. పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని జులై, ఆగస్టులో విక్రేతలు, రిటైలర్లు, పెద్ద ఎత్తున స్టాక్‌ తెప్పించుకున్నారు. దీంతో ఈ రెండు నెలల్లో వృద్ధి నమోదైనట్లు ఐడీసీ తెలిపింది. సెప్టెంబర్‌లో సరఫరాలు 2019 స్థాయికి పడిపోయినట్లు తెలిపింది. అధిక ధరలు ఈ నెలలో సరఫరాలను దెబ్బతీసినట్లు పేర్కొంది.

సెప్టెంబర్‌ త్రైమాసికంలో సరఫరాల్లో వృద్ధి లేనప్పటికీ, స్మార్ట్‌ఫోన్‌ సగటు ధర మాత్రం పెరిగిందని ఐడీసీ తెలిపింది. మూడు నెలల వ్యవధిలో ఒక్కో యూనిట్‌ సగటు విక్రయ ధర వార్షిక ప్రాతిపదికన 12 శాతం, త్రైమాసికం ప్రాతిపదికన 5 శాతం పెరిగి 21,000కు చేరినట్లు తెలిపింది. 5జీ స్మార్ట్‌ఫోన్‌ల సరఫరాలు 58 శాతం పెరిగి 2.5 కోట్లకు చేరాయని వెల్లడించింది. ఈ మూడు నెలల వ్యవధిలో విడుదలైన అత్యధిక స్మార్టుఫోన్ల సగటు ధర 8,330 రూపాయలగా పేర్కొంది. ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్ల సరఫరాలో వార్షిక ప్రాతిపదికన 16 శాతం వృద్ధి నమోదైంది.

- Advertisement -

శాంసంగ్‌ టాప్‌..

మన దేశ స్మార్ట్‌ ఫోన్ల మార్కెట్‌లో వివో బ్రాండ్‌ను శాంసంగ్‌ దాటేసి, అగ్రస్థానానికి చేరుకుంది. వార్షిక ప్రాతిపదికన ఈ కంపెనీ సరఫరాలు తగ్గినప్పటికీ, వాటాను పెంచుకోగలిగింది. సాంసంగ్‌ ఫోన్‌ ఒక్కో యూనిట్‌ సగటు ధర 43 శాతం పెరిగి 31,723 రూపాయలకు చేరిందని ఐడీసీ తన నివేదికలో పేర్కొంది. టాప్‌ ఐదు బ్రాండ్లలో అత్యధిక ధర ఉన్న కంపెనీ ఇదే. మార్కెట్‌ వాటా పరంగా చూస్తే రియల్‌ మీ రెండో స్థానంలో ఉంది. సీ53, 11 ఎ క్స్‌ మోడల్స్‌తో రియల్‌మీ వాటా పెరగడానికి దోహదపడ్దాయి.

అత్యధిక మార్కెట్‌ వాటా కలిగిన తొలి 5 కంపెనీల్లో వివో అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. వివోకు చెందిన వై, టీ సిరీస్‌ మోడళ్ల అమ్మకాలు పెరగడమే ఇందుకు కారణం. వన్‌ప్లస్‌, పోకో సరఫరాల్లోనూ 50 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేశాయి. మార్కెట్‌ పరంగా మన దేశంలో శాంసంగ్‌ 16.2 శాతం, రియల్‌మీ 15.1 శాతం, వివో 13.9 శాతం, షావోవి 11.7 శాతం, ఒప్పో 9.9 శాతం, వన్‌ప్లస్‌ 6.2 శాతం, పోకో 5.7 శాతం, యాపిల్‌ 5.5 వాతం ఇన్సీనిక్స్‌ 3.1 శాతం, టెక్నో 2.9 శాతం మార్కెట్‌ వాటా కలిగి ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement