Monday, April 29, 2024

Reliance | చిన్న పట్టణాలకు రిలయన్స్‌ రిటైల్‌.. 500 స్టోర్లను ఏర్పాటు చేయనున్న సంస్థ

దేశంలో చిన్న పట్టణాలకు విస్తరించాలని రిలయన్స్‌ రిటైల్‌ నిర్ణయించింది. ట్రెండ్స్‌ బ్రాండ్‌తో చిన్న పట్టణాల్లోనూ స్టోర్లు ఏర్పాటు చేయనుంది. ప్రాథమికంగా ఈ స్టోర్లను ఫ్రాంఛైజీ మోడల్‌లో ఏర్పాటు చేయాలని రిలయన్స్‌ రిటైల్‌ నిర్ణయించినట్లు
సంస్థ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు తెలిపారు. దేశవ్యాపంగా మొత్తం 500 స్టోర్లను ఇలా ఏర్పాటు చేయనుంది. రిలయన్స్‌ రిటైల్‌కు ప్రస్తుతం చిన్న పట్టణాల్లోనూ స్టోర్స్‌ ఏర్పాటు చేసింది.

అయితే తాజాగా ఏర్పాటు చేసే స్టోర్స్‌ చిన్న పట్టణాల్లో ఏర్పాటు చేయడంతో పాటు రూరల్‌ మార్కెట్‌లోకి ప్రవేశించాలని భావిస్తోంది. ప్రస్తుతం రిలయన్స్‌ రిటైల్‌లో దుస్తులు, నిత్యవసరాలు, ఎలక్ట్రానిక్స్‌, టెలికం కనెక్టివిటీ ఇలా పలు రకాల విభాగాల సమ్మేళనంగా ఏర్పాటు చేసింది. రిలయన్స్‌ ప్రస్తుతం ఫ్యాషన్‌ వరల్డ్‌ స్టోర్స్‌ను ఐదు నగరాల్లో ఏర్పాటు చేసింది.

ఈ స్టోర్లు అత్యధికంగా 5వేల చరదపు అడుగుల్లో ఏర్పాటు చేశారు. రిలయన్స్‌ ట్రెండ్స్‌ స్టోర్లను 8,000 నుంచి 24,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫ్యాషన్‌ వరల్డ్‌ స్టోర్స్‌ ఫార్మెట్‌లోనే ఇంకా చిన్న పట్టణాల్లో ఏర్పాటు చేసి, వాటిని రూరల్‌ మార్కెట్లకు విస్తరించాలని రిలయన్స్‌ భావిస్తోంది. ప్రస్తుతం దేశంలో 2,600 రిలయన్స్‌ ట్రెండ్స్‌ స్టోర్లు ఉన్నాయి.

- Advertisement -

ఈ నెలలో రిలయన్స్‌ 20 ఫ్యాషన్‌ వరల్డ్‌ స్టోర్లను ఏర్పాటు చేసింది. ఈ సంవతసరం చివరి నాటికి మొత్తం 100 స్టోర్లు వీటిని పెంచనుంది. ట్రెండ్స్‌ స్టోర్లు లేని ప్రాంతాల్లోనే ఫ్యాషన్‌ వరల్డ్‌ స్టోర్లను ఏర్పాటు చేస్తోంది. లక్ష వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో ప్రధానంగా ఫ్యాషన్‌ వరల్డ్‌ స్టోర్లను ఏర్పాటు చేస్తున్నారు. రిలయన్స్‌ రిటైల్‌ దేశంలోనే అతి పెద్ద అపెరల్‌ రిటైలర్‌గా ఉంది.

దేశవ్యాప్తంగా సంస్థకు 4 వేల స్టోర్లు ఉన్నాయి. ఈ స్టోర్లలో ఎక్స్‌క్లూజీవ్‌ బ్రాండ్స్‌తో పాటు, రిలయన్స్‌ బ్రాండ్‌ పేరుతోనూ దుస్తులను విక్రయిస్తోంది. యూత్‌ కోసం హై ఎండ్‌ ఫ్యాషన్‌ స్టోర్‌ అజోర్టేని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తోంది. చిన్న చిన్న పట్టణాలు, రూరల్‌ మార్కెట్‌లోనూ ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రిలయన్స్‌ వేగంగా స్టోర్స్‌ను ఏర్పాటు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement