Friday, May 17, 2024

Air passengers | 9 శాతం పెరిగిన దేశీయ విమాన ప్రయాణికులు

దేశీయ విమాన ప్రయాణికులు అక్టోబర్‌తో పోలిస్తే 9 శాతం పెరిగి నవంబర్‌లో 1.27 కోట్లుగా నమోదయ్యారు. నవంబర్‌లో పలు సార్లు రోజువారి ప్రయాణికుల సంఖ్య భారీగా నమోదైంది. అత్యధిక మంది ప్రయాణికులతో ఇండిగో అగ్రస్థానంలో కొనసాగుతోంది. నవంబర్‌లో ఇండిగో మార్కెట్‌ వాటా మాత్రం తగ్గింది. అక్టోబర్‌లో ఇండిగో మార్కెట్‌ వాటా 62.6 శాతంగా ఉంటే, నవంబర్‌లో అది 61.8 శాతంగా ఉంది.

నవంబర్‌లో ఏ విమానయాన సంస్థ కూడా 80 శాతం స్కోర్‌ను సాధించలేకపోయాయి. ఈ వివరాలను శుక్రవారం నాడు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) విడుదల చేసింది. ఈ నవంబర్‌లో 1.27 కోట్ల మంది ప్రయాణికులు ఉంటే, గత సంవత్సరం నవంబర్‌లో ఈ సంఖ్య 1.17 కోట్లుగా ఉంది. వార్షిక ప్రాతిపదికన ప్రయాణికుల వృద్ధి 9.06 శాతంగా ఉంది.

ఈ సంవత్సరం జనవరి నుంచి నవంబర్‌ వరకు 1,382.34 లక్షల మంది దేశీయ ప్రయాణికులు నమోదయ్యారు. గత సంవత్సరం ఇదే కాలంలో ఈ సంఖ్య 1,105.10 లక్షలుగా ఉంది. స్పైస్‌ జెట్‌ మార్కెట్‌ వాటా అక్టోబర్‌లో 5 శాతంగా ఉంటే, నవంబర్‌లో 6.2 శాతానికి పెరిగింది. విస్తారా మార్కెట్‌ వాటా 9.4 శాతంగా ఉంది. అక్షర ఎయిర్‌ 4.2 శాతంగా ఉంది. ఒన్‌టైమ్‌ ప్రొఫ్రార్మెన్స్‌ (ఓటీపీ)లో అక్షర ఎయిర్‌ 78.2 శాతంతో టాప్‌లో ఉంది. ఎయిర్‌ ఇండియా ఓటీపీ 62.5 శాతం, అలెయన్స్‌ ఎయిర్‌ 69.7 శాతం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement