Sunday, April 21, 2024

Felicitated – రేవంత్ రెడ్డిని సత్కరించిన ముస్లిం మత పెద్దలు

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని నేడు పలువురు ముస్లిం మత పెద్దలు, నాయకులు కలసి అభినందనలు తెలియచేశారు.డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో వచ్చిన ముస్లిం మత పెద్దలు, నాయకులు సీఎంను సన్మానించారు.

ఈ సందర్భంగా మైనారిటీల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలపై వారు పలు సూచనలు చేశారు.ఈ సమావేశంలో రవాణ, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎంఓ అధికారులు శివధర్ రెడ్డి, షా-నవాజ్ ఖాసీం, తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement