Monday, April 29, 2024

హైదరాబాద్‌లో తగ్గిన ఆఫీస్‌ లీజింగ్‌.. 83 శాతం తగ్గిన లీజింగ్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నగరంలో ఆఫీస్‌ల లీజింగ్‌ కార్యకలాపాలు తగ్గాయి. ఈ సంవత్సరం జనవరి- మార్చి నెలలో కార్యాలయాల లీజింగ్‌ 0.04 మిలియన్‌ చదరపు అడుగుల మేర జరిగిందని కొలియర్స్‌ ఇండియా తన నివేదికలో తెలిపింది. గత సంవత్సరం ఇదే కాలంలో 0.23 మిలియన్‌ చదరపు అడుగుల మేర లీజింగ్‌ జరిగింది. దీంతో పోల్చుకుంటే ఈ సారి 83 శాతం తగ్గినట్టు కనిపిస్తోంది.

చెన్నయ్‌, ముంబై, పుణే నగరాల్లోనూ ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. బెంగళూర్‌లో మాత్రం 343 శాతం వృద్ధితో 1.02 మిలియన్ల చదరపు అడుగుల లీజింగ్‌ జరిగిందని పేర్కొంది. ఢిల్లిలో 294 శాతం వృద్ధితో 0.63 మిలియన్‌ చదరపు అడుగుల లీజింగ్‌ జరిగినట్లు నివేదిక తెలిపింది. దేశంలోని ప్రధాన నగరాల్లో 2022లో 2.05 మిలియన్‌ చదరపు అడుగుల లీజింగ్‌ జరిగితే, 2023లో 2.06 మిలియన్‌ చదరపు అడుగుల లీజింగ్‌ నమోదైంది.

టెక్నాలజీ సంస్థలే అధికం….

కార్యాలయాలను లీజింగ్‌ తీసుకుంటున్న వాటిలో టెక్నాలజీ సంస్థల వాటా 22 శాతంగా ఉంది. ఫ్లెక్సీ స్పేస్‌ లీజింగ్‌ 20 శాతమని తెలిపింది. దీని తరువాత బీఎఫ్‌ఎస్‌ఐ, కన్సల్టింగ్‌, ఇంజినీరింగ్‌, ఇ-కామర్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఆరోగ్య, ఫార్మా, ఇతర విభాగాల సంస్థలు ఉన్నాయి. కార్పొరేట్‌ సంస్థలు హైబ్రిడ్‌ విధానంలో కార్యాలయాల నిర్వహణపై దృష్టి సారించడంతో, కొత్త కార్యాలయాల లీజింగ్‌లో సాంకేతిక రంగం వాటా 2022లో 34 శాతం నుంచి 2023 నాటికి 22 శాతానికి పడిపోయింది. అదే సమయంలో ఫ్లెక్సీ స్పేస్‌కు డిమాండ్‌ పెరిగిందని కొలియర్స్‌ ఇండియా ఆఫీస్‌ సర్వీసెస్‌ ఎండీ పీష్‌ జైన్‌ చెప్పారు.

- Advertisement -

కొత్త భవనాలు, సరఫరాల పరంగా ఢిల్లిd, ముంబై నగరాల్లో వృద్ధి నమోదైంది. ముంబైలో 200 శాతం, ఢిల్లిdలో 15 శాతం పెరిగింది. పుణేలో 80 శాతం తగ్గింది. హైదరాబాద్‌లో 11 శాతం, బెంగళూర్‌లో 4 శాతం, చెన్నయ్‌లో 74 శాతం తగ్గింది. దేశవ్యాప్తంగా చూస్తే 2022 మొదటి త్రైమాసికంలో 14.4 మిలియన్‌ చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ కొత్తగా అందుబాటులోకి వచ్చింది. 2023లో 34 శాతం తక్కువగా 9.5 మిలియన్‌ చదరపు అడుగులు మాత్రమే అందుబాటులోకి వచ్చిందని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement