Saturday, May 4, 2024

అమెరికాలో టోర్నడోల బీభత్సం.. 7 రాష్ట్రాల్లో విధ్వంసం, 25 మంది మృతి

అమెరికా రాష్ట్రాలను టోర్నడోలు తుపాన్లు హడలెత్తిస్తున్నాయి. గతవారం మిసిస్సిపి పరిసర ప్రాంతాల్లో బీభత్సం సృష్టించిన టోర్నడో తాజాగా దక్షిణ, పశ్చిమమధ్య ప్రాంతాలను వణికించింది. అర్కన్సాస్‌, ఇల్లినాయిస్‌, ఇండియానా, అలబామా, టెన్నెస్సీ సహా ఏడు రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించింది. టోర్నడోల ధాటికి 25 మంది మరణించగా, 28 మంది గాయపడ్డారు. గంటకు 70 మైళ్ల వేగంతో పెనుగాలులు విరుచుకుపడటంతో అనేక ఇళ్లు, షాపింగ్‌ మాల్స్‌ కుప్పకూలాయి. మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.

గాలి తీవ్రతకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. దీంతో సుమారు 3 లక్షలకుపైగా ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పెనుగాలుల వల్ల అక్కడక్కడ అగ్నిప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి. రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. షికాగో ఎయిర్‌పోర్టులు విమానాల రాకపోకలను నిలిపివేశారు. వచ్చే బుధవారం మరికొన్ని భారీ తుఫాన్లు, టోర్నడోలు వచ్చేఅవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది.

https://twitter.com/Marianna9110/status/1642038200758665216
Advertisement

తాజా వార్తలు

Advertisement