Monday, April 29, 2024

కినారా క్యాపిటల్‌ 380 కోట్ల సేకరణ.. 2025 నాటికి 6వేల కోట్ల ఆర్డర్‌ బుక్‌..

ట్రిపుల్‌ జంప్‌.. ఏఎస్‌ఎన్‌ మైక్రో క్రెడియెట్‌ ఫాండ్స్‌ భాగస్వామ్యంతో నువిన్‌ నేతృతంలోని ఫిన్‌టెక్‌ రుణదాత కినారా క్యాపిటల్‌ ఈకిటీలో రూ.380 కోట్లు పొందింది. 2025 నాటికి ఆర్డర్‌ బుక్‌ను 5 రెట్లు పెంచి.. రూ.6000 కోట్లకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించింది. కినారా క్యాపిటల్స్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌లో చేరడానికి నువీన్‌ నుంచి ఇద్దరు కొత్త సభ్యులు చేరుతున్నారు. భారతదేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఎంఎస్‌ఎంఈ ఫిన్‌టెక్‌గా కినారా క్యాపిటల్‌ నిలుస్తున్నది. ఈ నూతన ఈక్విటీ పెట్టుబడులు అనేవి.. భారతదేశంలో వేగంగా పెరుగుతున్న ఎంఎస్‌ఎంఈ క్రెడిట్‌ డిమాండ్‌ను తీర్చడానికి, సేవల విస్తరణకు దోహదం చేస్తుందని కినారా క్యాపిటల్‌ సీఈఓ, వ్యవస్థాపకుడు హార్దికా షా తెలిపారు. 2025 నాటికి 500 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని, రాబోయే మూడేళ్లలో.. రూ.10,000 కోట్ల ఎంఎస్‌ఎంఈ వ్యాపార రుణాల పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.

కినారా క్యాపిటల్‌ కోసం ఈ రౌండ్‌ ఈక్విటీ ఫైనాన్సింగ్‌ నువిన్‌ గ్లోబల్‌ ఇంపాక్ట్‌ ఫండ్‌ నుంచి వచ్చింది. కినారా క్యాపిటల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌లో నువిన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ ప్రైవేట్‌ ఈక్విటీ ఇంపాక్ట్‌ కో-హెడ్‌ రేఖా ఉన్నితాన్‌, నువిన్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రైవేట్‌ ఈక్విటీ ఇంపాక్ట్‌ స్టీఫెన్‌ లీ చేరారు. కినారా తన మైకినారా యాప్‌తో పూర్తి డిజిటల్‌ ప్రాసెస్‌ను అందిస్తున్నది. భారతదేశంలోని 90కు పైగా నగరాల్లోని చిన్న వ్యాపారవేత్తలకు 110కు పైగా శాఖలతో డోర్‌ స్టెప్‌ కస్టమర్‌ సేవలను అందిస్తున్నది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిల్చోవడం సంతోషకరమని వివరించారు. ఆర్థిక వ్యవస్థలను మార్చే, వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించే వినూత్న కంపెనీలను నువిన్‌ సెర్చ్‌ చేస్తున్నదని నువిన్‌ ఎండీ రేఖ ఉన్నితన్‌ అభిప్రాయపడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement