Friday, May 3, 2024

భారత్‌లో బలమైన ఆర్థిక వృద్ధి, దశాబ్దంలో రికార్డు లక్ష్యం : నిర్మలా సీతారామన్‌

కరోనా మహమ్మారి నుంచి భారత్‌ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం.. విశిష్టమైందని, ఈ దశాబ్దంలో భారత్‌ బలమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి నిధి, ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశానికి సీతారామన్‌ హాజరయ్యారు. కరోనా సమయంలో భారత్‌ ఎదుర్కొన్న సవాళ్లు, అధిగమించిన తీరు, కరోనాపై ప్రజలు ఎలా విజయం సాధించారనే విషయాల గురించి ఆమె వివరించారు. కరోనా మహమ్మారి నుంచి భారత్‌ రికవరీ అయ్యిందని, 2030 దశాబ్దం తమ ముందు ఉందని, ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కరోనాకు ముందు, తరువాత పరిస్థితులను వివరించారు. పలు రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చామని, కరోనా విపత్కర పరిస్థితిని ఓ అవకాశంగా మలుచుకున్నామని తెలిపారు. కరోనా మహమ్మారికి ముందు తీసుకొచ్చిన జీఎస్టీ, డిజిటలైజేషన్‌లు ఎంతో విజయవంతంగా కొనసాగుతున్నాయని వివరించారు. ప్రపంచంలో ఎక్కడా కనిపించని ఆర్థికపరమైన వృద్ధి భారత్‌లో కనిపించిందని చెప్పుకొచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement